సాక్షులను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్ రావు
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 18 :-
ఏడుగురు సాక్షుల విచారణ
పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
భార్య హత్య కేసులో ముద్దాయి ప్రస్తుత నిందితుడు జాడి రాధాకృష్ణ బెయిల్‌పై బయటకు వచ్చి, 08-09-2025 సాయంత్రం తన భార్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వారిని భయభ్రాంతులకు గురిచేసి, ఇంటి వద్ద సామాను చిందరవందరగా పడేసి, తనపై నమోదైన కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు. అదేవిధంగా కోర్టులో సాక్ష్యం ఎలా చెప్తారో అని హెచ్చరిస్తూ ప్రాణహాని బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై నిందితుని మామ ఉట్నూర్ మండలం గంగన్నపేట గ్రామానికి చెందిన పెరుగు సంజీవ్ (తండ్రి: భీమన్న) ఫిర్యాదు చేయగా, ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఎస్సై కే. ప్రవీణ్ కుమార్ క్రైమ్ నెంబర్ 250/2025 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
ఈ కేసులో సిడిఓ సిహెచ్ నరేందర్ ఏడుగురు సాక్షులను ప్రవేశపెట్టగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ. రహీం వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన గౌరవనీయ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు ముద్దాయి రాధాకృష్ణకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
కోర్టు లైజన్ అధికారి ఎం. గంగా సింగ్ మరియు కోర్టు డ్యూటీ అధికారి సిహెచ్ నరేందర్‌లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు.