logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉగాది మరియు రంజాన్ పండుగలు దైవం చూపిన మార్గాలలో జరుపుకోవాలీ

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ గఫార్ తన 70 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ సోదరభావంతో మెలగాలని, ఉగాది మరియు రంజాన్ పండుగలు దైవం చూపిన మార్గాలలో ఐకమత్యంతో పండుగలు చేసుకోవాలని తన ఫ్లెక్సీ బోర్డును తన ఆటోలో అంటించుకుని ఊరురా తిరుగుతూ ప్రచారం చేయుచున్నాడు. షడ్రుచుల ఉగాది, ఆకలి దప్పుల దీక్షతో ఉన్న రంజాన్ ఉపవాసాలు మానవులందరినీ ఏకతాటిపై నడిపిస్తున్న మహోన్నతమైన రామబాణం లాంటి పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఆటో రాజా తదితరులు పాల్గొన్నారు

10
285 views

Comment