కొండమైసమ్మపండుగ గ్రామపంచాయతీతీర్మానం
కోనరావుపేట మండల కేంద్రంలో కొండ మైసమ్మ పండుగ గురించి గ్రామంలోని రైతులందరినీ గ్రామపంచాయతీ పరిధిలో సమావేశం జరపడం జరిగింది ఇందులో భాగంగా సర్పంచ్ మస్కూరి కాశీరాం మాట్లాడుతూ గ్రామ దేవత అయినా కొండ మైసమ్మ పండగను ఏప్రిల్ ఐదో తారీకు రోజున జరుపుటాకు రైతులందరి సమక్షంలో తీర్మానించుకున్నారు గ్రామ దేవత అయినటువంటి మైసమ్మ పండుగను రైతులు ప్రజలు గ్రామంలోని అన్ని వర్గాల వారు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసుకోవాలని సర్పంచ్ కోరారు ఈ కార్యక్రమంలో రైతులు పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు