బాధిత కుటుంబాలకు అండగా జిల్లా పోలీసు వ్యవస్థ
హోంగార్డ్ లక్ష్మి పార్తివదేహానికి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ.
అనారోగ్య కారణంగా పరమపదించిన హోంగార్డు లక్ష్మి.
తక్షణ సహాయార్థం రూ 10వేలు అందజేత.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
గత కొద్దికాలంగా అనారోగ్యం కారణాలతో బాధపడుతున్న హోంగార్డు లక్ష్మి ఈరోజు ఉదయం 6 గంటలకు స్వర్గస్తులవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, స్థానిక రామ్ నగర్ నందు గల తన స్వగృహానికి చేరుకుని పార్తివదేహానికి పూలమాల అలంకరించి నివాళులర్పించారు. తదుపరి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఎలాంటి అవసరమున్న జిల్లా పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తక్షణ సహాయార్థం అంతక్రియల ఖర్చుల నిమిత్తం పదవేల రూపాయల కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధిత కుటుంబాలకు జిల్లా పోలీసు వ్యవస్థ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు ఇన్చార్జ్ ఆర్ఐ ఎన్ చంద్రశేఖర్, వార్డ్ కౌన్సిలర్ చరణ్ గౌడ్, హోంగార్డ్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.