మినీ నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీలకు అరకు విద్యార్ధులు
గుంటూరు లో ఈనెల 26 నుండి ఏప్రిల్ 7వరకు జరిగే ఆర్చరీ మినీ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలలో అరకులోయ క్రీడా పాఠశాల విద్యార్ధులు పాల్గొంటున్నట్లు ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి బుధవారం తెలిపారు. పాఠశాల నుండి అండర్15 విభాగంలో లలిత్ సాయి తేజ, అండర్ 13 విభాగం నుండి కేత్విన్ హర్షా, ఏ రవికాంత్ లు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఈవెంట్ లో అండర్ 15 కోచ్ గా పాఠశాలకు చెందిన ఆర్చరీ కోచ్ సూరిబాబు వ్యవహరించనున్నారు