logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బుచ్చింపేట గ్రామం నుంచి నవోదయలో చరిత్ర సృష్టించిన అభినవ్ శ్రీ

రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామానికి చెందిన రెడ్డి అభినవ్ శ్రీ, శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతూ నవోదయ ప్రవేశ పరీక్షల్లో 92.5 శాతం మార్కులతో ఆరో తరగతికి ఉత్తీర్ణత సాధించాడు. గ్రామం నుంచి నవోదయ విద్యాలయానికి ఎంపికైన మొట్టమొదటి విద్యార్థిగా అతని విజయం చరిత్రాత్మకం.ఈ గొప్ప సాఫల్యంపై స్కూల్ ప్రిన్సిపల్ అనిమిరెడ్డి లక్ష్మి, యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రెడ్డి కృష్ణంరాజు (మాస్టర్), హేమలత (ప్రైవేట్ టీచర్) హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు, ప్రజలు, యువత కూడా అభినవ్‌ను అభినందిస్తూ ముందుగా మెరుగైన భవిష్యత్తుకు ఆశలు వ్యక్తం చేశారు.ఈ విజయం గ్రామీణ విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు.

4
630 views

Comment