logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

త్రాగునీరు వృధా పోతున్న.... పట్టించుకోరా....?

విజయనగరం జిల్లా. రాజాం:

రాజాం మున్సిపాలిటీ పరిధిలో కొండంపేట గ్రామానికి వెళ్లే రహదారిలో మంగళవారం ఉదయం నుంచి పైపులైన్ లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా పారిపోతున్నా పట్టించుకునే వారు కనిపించకపోవడం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది.
ఇప్పటికే వేసవి కాలంలో తాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలా నీరు వృథా కావడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని సరిచేసి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

71
3502 views

Comment