logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వందలాది మందికి రంజాన్ తోఫా పంపిణీ.

నంద్యాల (AIMA MEDIA): వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాష పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని, సమాజంలో ఉన్న ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ ను సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నంద్యాల పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శిల్పా చారిటీస్ ఛైర్పర్సన్ నాగిని రవి సింగరెడ్డి చేతుల మీదుగా 600 మందికి రంజాన్ తోఫా కిట్లను, అలాగే మహిళకు చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శిల్పా చారిటీస్ ఛైర్పర్సన్ నాగిని రవి సింగరెడ్డి మాట్లాడుతూ..అనేక సంవత్సరాల నుండి నిరంతరాయంగా రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని శిల్పా సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇలాగే దాల్మిల్ అమీర్ బాషా నిరంతరాయంగా రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. దాల్మిల్ అమీర్ బాషా ను అనేక మంది స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, మరిన్ని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దాల్మిల్ అమీర్ బాషా మాట్లాడుతూ.... ప్రతి ఏడాది రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

0
1085 views

Comment