logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడారి నరేష్: జగిత్యాల జిల్లా: కథలాపూర్ మండలం, సిరికొండ స్థాయి స్కూల్ కాంప్లెక్స్ బాల మేధ పోటీలు విజయవంతం - బొమ్మేన విద్యార్థుల ప్రభంజనం...

జగిత్యాల జిల్లా: కథలాపూర్ మండలంలోని సిరికొండ కాంప్లెక్స్
స్థానిక తక్కలపల్లి పాఠశాలలో బాల మేధ సదస్సు ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ క్విజ్ పోటీలలో సాధారణ జ్ఞానం, విజ్ఞానం, చరిత్ర, క్రీడలు వంటి విభాగాల్లో ప్రశ్నలు అడగగా, విద్యార్థులు చురుకుగా సమాధానాలు ఇచ్చారు. పోటీలు విద్యార్థులలో ఆలోచనా శక్తి, జ్ఞానపిపాసను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయని నిర్వాహకులు తెలిపారు. బొమ్మెన ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులకు మొదటి మరియు ద్వితీయ బహుమతి గెలుపొందారు.
విజేతలకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేయగా ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా MEO శ్రీ లోకిని శ్రీనివాస్ గారు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

46
43 views

Comment