బడ్జెట్‌లో మహాలక్ష్మి, పెన్షన్ల పెంపునకు నిధులు కేటాయించాలి
మునిగడప పద్మ, 16వ డివిజన్ కార్పొరేటర్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు
బడ్జెట్‌లో మహాలక్ష్మి, పెన్షన్ల పెంపునకు నిధులు కేటాయించాలి
హామీలను నెరవేర్చి ప్రజా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి
మునిగడప పద్మ, 16వ డివిజన్ కార్పొరేటర్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు
కొత్తగూడెం : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మహాలక్ష్మి పథకానికి, పెంచిన సామాజిక పెన్షన్లకు తక్షణమే నిధులు కేటాయించి ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని 16వ డివిజన్ కార్పొరేటర్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు మునిగడప పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జరిగిన మహిళా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లు రూ. 4,000 చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ అమలు చేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మహిళలకు నెలకు రూ. 2,500 ఇచ్చే మహాలక్ష్మి పథకం కూడా హామీగానే మిగిలిపోయిందని విమర్శించారు. ఏడేళ్లుగా కొత్త పెన్షన్లు మంజూరు కాక పేదలు ఎదురుచూస్తున్నారని, ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించి పేదలను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.