logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ బాధ్యతలు స్వీకరించిన పి.గోపాల్.

కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా పి. గోపాల్ మంగళవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. కళాశాల అధ్యాపకులు నూతన ప్రిన్సిపాల్ కు స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఇట్టి సందర్భంగా నూతన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కొడిమ్యాల మండలం గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, అధ్యాపకుల సహకారంతో జూనియర్ కళాశాల సమగ్ర అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తాను అని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో కరీంనగర్ ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ బాధ్యులు ఆంజనేయరావు, మహేంద్ర కుమార్, సత్యనారాంజనేయ,శశిధర్ శర్మ, శివరామకృష్ణ, జగిత్యాల లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.వేణు, కళాశాల అధ్యాపకులు జయపాల్, ప్రమోద్, బాలకృష్ణ, జయశీల, అనిల్ కుమార్, తిరుపతి, నర్సయ్య, సుమన్, భాస్కర్, ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

33
2018 views

Comment