logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నార్త్ రాజుపాలెంలో శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహణ

కోడలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామంలోని తపాతోపు కాలనీలో శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, మొక్కుబడులు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ జాతర మహోత్సవంలో ముఖ్య అతిథులుగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కరకటి మల్లికార్జున్, యాల్లాయపాలెం ఎంపిటిసి సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్, పోశం రెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు మందపాటి రమణారెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ, మాజీ ఉప సర్పంచ్ పాటూరి రమేష్ బాబు, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి పుల్ల మోహన్ రావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్థానిక కాలనీ భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి, జాతరను భక్తి భావంతో విజయవంతం చేశారు.

25
180 views

Comment