logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు విజయిభవ… చికెన్ ఫాక్స్ నివారణకు హోమియో మందుల పంపిణీ

కోట మండలంలో విద్యార్థుల ఆరోగ్యం, విద్యలో విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
విద్యా ప్రదాత, స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా, ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో “విజయిభవ” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా, ఎంవీ రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన ఫౌండేషన్ సభ్యులు ఎస్‌ఎస్‌సీ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
శ్రీ కాళహస్తీశ్వరుని దేవాలయంలో పూజలు చేసి, విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తూ స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు.
అనంతరం, పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చికెన్ ఫాక్స్ వంటి వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తగా హోమియో మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల కరస్పాండెంట్ బి. మధుసూదన్ రావు మాట్లాడుతూ… విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి, ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
అలాగే, స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం. విజయలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

0
0 views

Comment