logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రోలుగుంట మండలంలో తాగునీరు,విద్యుత్, ఉపాదా హామీ పథకం మొదలగు వాటిపై ఎంపీపీ సమీక్ష.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మంగళవారం. వేసవి ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలు, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం వంటి కీలక అంశాలపై చర్చించారు. రోలుగుంట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన 23 శాఖల అభివృద్ధి పనుల సమీక్ష సమావేశాన్ని ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఎంపీడీవో నాగేశ్వరరావు, 23 శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రజలకు తాగునీటి సమస్యలు ఎదుర్కొనకుండా చూడాలని, బోరు బావులు, చెరువులు మరమ్మత్తు పనులు వేగవంతం చేయాలని ఎంపీపీ ఆదేశించారు. విద్యుత్ కట్‌లు తగ్గించి, రాత్రి సమయంలో కూడా స్థిరమైన సరఫరా ఉండాలని, ఉపాదా హామీ పథకం పనుల్లో ఆలస్యం జరగకుండా లక్ష్యాలు సాధించాలని స్పష్టం చేశారు.సమావేశంలో అధికారులు ప్రతి శాఖలో జరుగుతున్న పనుల పురోగతిని వివరించారు. ఎంపీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, "ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలి. వేసవి ముందు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి" అని అన్నారు. ఈ సమీక్ష ద్వారా మండలంలో అభివృద్ధి పనులు మరింత వేగం వంతం అవుతాయని అభిప్రాయపడ్డారు.ఈ సమావేశం గ్రామీణ ప్రజలకు ఎదురుపడే సవాళ్లను పరిష్కరించే మార్గదర్శకంగా మారింది. మండల అధికారులు ఆదేశాలను అమలు చేస్తూ, పనులను వేగవంతం చేస్తామని తెలిపారు

4
415 views

Comment