logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అగ్గి రాముడు ". 𝟭𝟵𝟵𝟬ఏప్రిల్𝟭𝟳

రామరాజ్యాన్ని స్మశానంలోనైనా స్థాపించాలని రాముడిగా పేరు పెట్టుకుని తల్లితండ్రుల వివరాలు తెలియని వెంకటేష్ తన స్మశాన వాటికలో సర్వాధికారిగా శిక్షలు విధిస్తూ టైటిల్ రోల్ పోషించిన సినిమా " అగ్గి రాముడు ". 𝟭𝟵𝟵𝟬ఏప్రిల్𝟭𝟳 విడుదలైన ఈసినిమాలో వెంకటేష్ అన్నదమ్ములుగా డబల్ రోల్ లో నటించారు.ఇదేపేరుతో𝟭𝟵𝟱𝟰 నాటి 𝗡𝗧రామారావు భానుమతిల సినిమా కూడా ఉంది.
దాదాపుగా అప్పటి డబల్ రోల్ సినిమాల్లో ఓపాత్ర సరదాగా తిరిగేదైతే , రెండో పాత్ర సీరియస్ గా సాగుతుంది . రెండు పాత్రల్లోనూ వెంకటేష్ చాలా బాగా నటించాడు. శారద క్యారెక్టర్ ను పవర్ ఫుల్ గా చూపడంలో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకముగా చెప్పాల్సినవసరంలేదు. జడ్జిగా..కన్న కొడుకును వేరేవారికిచ్చి న్యాయానికి విలువిచ్చే త్యాగమూర్తి తల్లిగా శారద ఎమోషన్& పవర్ఫుల్ నటన అమోఘం...... తల్లీకొడుకులుగా వీరిద్దరి తర్వాత స్మగ్లింగ్ రహస్యాలను కష్టమ్స్ వారికి అందించాడనే కసితో విలన్ల చేతిలో కొడుకు చనిపోగా , కొడుకు శవాన్ని లాగుడు బండిలో స్మశానానికి తీసుకెళ్లడము,అక్కడ తన కథను వెంకటేష్ కు చెప్పడము , ఆచావుకు కారణమైన ప్రదీప్ శక్తికి శిక్ష విధించమంటే , చంప బోయి త్రిశూలం కిందపారేసే సీన్ లలో నిర్మలమ్మ నటనను మెచ్చుకోక తప్పదు . ఆమె పాత్ర కూడా సినిమాలో చాలా బాగా పండింది . ఈ మధ్య గల్ఫ్ దేశాలనుండి అక్రమ బంగారం స్మగ్లింగ్ కొత్త కొత్త విధానాలతో జరుగుతూ ఉంది. చివరకు మర్మావయాలలో కూడా పెట్టుకు వచ్ఛేస్తున్నారు .
అదేతరహాలో సినిమా మొదలవగానే ఆడమనిషి వేషంలో వజ్రాలు స్మగ్లింగ్ చేస్తూ ఫైటర్ పొన్నాంబలం కనబడతాడు.
ఆ తర్వాత ఒక ఫైట్ కూడా ఉందనుకోండి.....
పరుచూరి సోదరుల రచనలో 𝗦𝗦 రవిచంద్ర దర్శకత్వం వహించగ వెంకటేషులకుజోడిగా అమల,గౌతమి నటించారు. వేటూరి సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్రాసిన పాటలు మనో, బాలసుబ్రహ్మణ్యం జానకమ్మలు పాడగా చక్రవర్తి సంగీతము అందించిన పాటలకు సుందరం-తార మాస్టర్లు బాగా డాన్స్ ఆడించారు.
టూకీగా కథలోకి వస్తే...డాక్టర్ గా శరత్ బాబు, లాయర్ గా శారద ప్రాక్టీస్ చేస్తున్న దంపతులకు ఓమగబిడ్డ పుడతాడు.
శరత్ బాబుకు జయలలితతో వివాహేతర సంబంధం ఉండి ఆమెకు కూడా ఓబాబు పుడతాడు .పుట్టింటి నుండి వచ్చిన శారదకు ఈ విషయము తెలిసి ,జయలలిత,శారదల మధ్య ఓఒప్పందముతో జయలలిత బిడ్డ , ఆఇంటి వారసుడిగా పెరగాలని ,ఇద్దరు బిడ్డలను మార్చుకుంటారు. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తముగ ఆత్మహత్య చేసుకోబోయిన శరత్ బాబు మేడ పైనుండి జారిపడి పిచ్చివాడుగా మారుతాడు. జయలలిత తనమారు బిడ్డను తండ్రి కిచ్చి చనిపోగా అతను అనాధగా పెరిగి స్మశానములో కాటి అధిపతిగా ఉంటాడు. అన్యాయం, అక్రమాలను ఎదిరిస్తూ తనేస్వయంగా శిక్షలు విధిస్తుంటాడు. ఆపై విలన్లు, ఫైటింగులు,కోర్టు సన్నివేశాలు, తల్లి కొడుకుల సెంటిమెంట్లు , చివరకు అసలు కథ తెలిసి ఇద్దరు కొడుకులతో పిచ్చివాడైన శరత్ బాబు పిచ్చికుదిరి అందరూ ఒకటవటముతో శుభం కార్డు పడుతుంది....
ఏమాత్రము యాక్షన్ సెంటిమెంట్ సీన్స్ విసుగెత్తకుండా సాగే ఈ సినిమాలో....విలన్లుగా సత్యనారాయణ,చలపతి రావు , వీరి సహాయకుడిగా ప్రదీప్ శక్తి , పిచ్చాసుపత్రి డాక్టర్ గా కోట శ్రీనివాసరావు , ఆయనకూతురిగా రెండవ వెంకటేష్ జోడిగా అమల, అగ్గి రాముడికి జోడిగా గౌతమి , భువనగిరి బాబ్జిగా బాబు మోహన్ , అమల స్నేహితురాలిగా హేమ , 𝗦𝗜గా నర్రా వెంకటేశ్వరరావు తదితరులు నటించిన యాక్షన్
మూవీ యూట్యూబ్ లో ఉంది. ఇంతకుముందు చూడని వారు ఓసారి చూడవచ్చు...

0
25 views

Comment