logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

𝗕 గోపాల్ -మాస్ హీరో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన లారీ డ్రైవర్

మాస్ డైరెక్టర్𝗕 గోపాల్ -మాస్ హీరో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన డబుల్ మాస్ చిత్రం " లారీ డ్రైవర్ ". జయాప్రొడక్షన్స్ బ్యానర్ పై𝟭𝟵𝟵𝟬డిసెంబర్ 𝟮𝟭న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నటవిరాట్ రావు గోపాల రావు సమర్పణలో బాలకృష్ణతో బి.గోపాల్ చేసిన మొదటి సినిమా ఇది . లారీ డ్రైవర్ పేరుతో శరత్ కుమార్ హీరోగా తమిళ్ లో చేసిన" 𝗽𝗮𝗮𝗿𝗮𝗶 " డబ్బింగ్ సినిమా కూడాఉంది.
ఈ రెండు సినిమాలకు ఎటువంటి పోలిక ఉండదు వేటికవే ప్రత్యేక కథలతో సాగుతాయి.....
రచయిత 𝗔 ఆంజనేయ ప్రసాద్ కధతో పాటు , బ్రేకులులేని లారీలా సాగే బిగుతైన స్క్రీన్ ప్లే కు దర్శకుడు 𝗕.గోపాల్ పరుగులు పెట్టించగా...దానికిధీటుగా పరుచూరి సోదరులు తూటాల్లాంటి మాటలు వ్రాసారు . రావుగోపాలరావు ,శారద బాలకృష్ణ లాంటి క్రేజీ నటులు ఉంటే వారి రచన ఎలా ఉంటుందో ప్రత్యేకముగా చెప్పాల్సినవసరం ఉండదు...
రావు గోపాల రావు పాత్ర నిడివి తక్కువైనప్పటికీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా , ఓ అవినీతి కొడుకుకు తండ్రిగా వచ్చే డైలాగులు థియేటర్లో బాగా పేలాయి....
చక్రవర్తి సంగీతంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి జొన్నవిత్తుల పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బాలకృష్ణ-విజయశాంతి లతో డ్యూయెట్స్ , ఓ గ్రూప్ సాంగ్.... ముఖ్యముగా బోరింగ్ పాప జయలలిత సాంగ్ లో తైల మర్దనలు లాంటి సీన్స్ ముసలోడికి కూడా కన్ను ఆర్పనీయకుండా చేస్తాయి (😂).
సుందరం , తారా , రఘురాం , ప్రభుదేవా మాస్టర్లు అందంగా హుషారుగా , జోరుగా డాన్స్ ఆడించారు.
టూకీగా సినిమా కథకొస్తే రాజాకృష్ణమూర్తి , బాబుమోహన్ లారీ ట్రాన్స్పోర్ట్ యజమానులుగా ఉంటారు . క్లీనర్ డ్రైవర్ కావచ్చు డ్రైవర్ ఓనర్ కాకూడదనే కుటిల బుద్ధి ఉన్న వీరు , వీరి దగ్గర పనిచేసే ఇద్దరు డ్రైవర్లు ఓనర్లు కావటంతో సబ్ ఇన్స్పెక్టర్ వినోద్ ద్వారా తప్పుడు కేసు బనాయించి వారిని స్టేషన్ లో పెడతారు.లారీడ్రైవర్లకు అండగాఉండే బాలకృష్ణ , అదే తరహాలో 𝗦𝗜కు బుద్ధిచెప్పి స్టేషన్ కు తీసుకెళ్ళి అతనిపై కేసు వ్రాయమంటాడు . చట్టాన్ని తన చేతుల్లోకితీసుకున్న బాలకృష్ణతో భార్యాభర్తలైన𝗜𝗔𝗦 శారద-𝗜𝗣𝗦విజయ కుమార్ మందలించేక్రమంలో , అవినీతి ఎస్ఐ తండ్రి న్యాయవాది అయిన రావుగోపాల్రావు బాలకృష్ణను బెయిల్ పై బయటకు తీసుకురాగా, వినోద్ ఉద్యోగం నుండి సస్పెండ్ అవుతాడు.
సస్పెండ్ అయిన 𝗦𝗜 క్రిమినల్ పోలీస్ మైండ్ తో లారీ ఓనర్ జయమ్మ పాత్రధారి విజయశాంతి ద్వారా తోటి లారీ డ్రైవర్ అందరిని ఓనర్లుగా చేస్తానని నమ్మించి , బ్యాంకు మేనేజర్ కు డబ్బులు నగలు డిపాజిట్ చేస్తారు . డబ్బు తీసుకున్న బ్యాంకు మేనేజర్ ప్లేట్ ఫిరాయించడంతో డ్రైవర్లందరూ లబోదిబోమని తమ గోడు బాలకృష్ణ దగ్గర చెప్పుకుంటారు.
ఆపై బాలకృష్ణ బాంక్ మేనేజర్ బెదిరించగా అతను విలన్ల దగ్గర పోయి చెప్పుకుంటాడు . రాధాకృష్ణమూర్తి ని బెదిరించే క్రమములో ఆయన అంగరక్షకుడు మేనేజర్ ను చంపేస్తాడు.
ఆ హత్య చూసిన శారదను కూడా చంపాలని చూస్తాడు.
శారదను రచించిన బాలకృష్ణ ద్వారా హత్య చేసిన వ్యక్తిని కనుగొని స్టేషన్లో పెడతారు . ఆ హత్య నుండి బయట పడేందుకు బాబు మోహన్ రాజా కృష్ణమూర్తి గుడివాడ రౌడీ లేదు లేదు..అచ్చుతప్పు గుడివాడరాయుడు అనబడే రౌడీకి సుపారీ ఇచ్చి స్టేషన్ లో చంపేస్తారు . పోలీస్ ఇంటరాగేషన్లో 𝗦𝗣 విజయకుమార్ చేతిలో చనిపోయాడని కేసు , కోర్టు...
కోర్టులో కేసు వాదించిన న్యాయవాదిని చంపేశారని𝗜𝗔𝗦 , 𝗜𝗣𝗦 భార్యాభర్తల పై మరో తప్పుడు కేసు... ఇలా అనేక మలుపులతో ఇంట్రెస్ట్ గా సాగి.... చివరకు విలన్లను చట్టానికి పట్టివ్వడముతో సినిమాకు శుభం కార్డు పడుతుంది .....
పైతారాగనముతోపాటు....గుడివాడ రౌడీ & రాయుడిగా మోహన్ రాజ్, రాజాకృష్ణమూర్తి అంగ రక్షకుడిగా ఆంటోనీ , బాంక్ మేనేజర్ గా జయప్రకాశ్ రెడ్డి , 𝗦𝗜గా వినోద్ , గుడివాడ రాయుడి కేసు వాదించే లాయరుగ తనికెళ్లభరణి , జడ్జిగా నూటొక్కజిల్లాల అందగాడు నూతన ప్రసాద్ ,
బోరింగ్ పాపగా జయలలిత, రాళ్లపల్లి చిడతల అప్పారావు లారీ డ్రైవర్లుగా , క్లీనర్ గా బ్రహ్మానందం , గుడివాడ రౌడీ సహాయకుడిగా జగ్గారావు తదితరులు

2
103 views

Comment