logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అనకాపల్లి జిల్లా పాడి పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు

అనకాపల్లి జిల్లా పాడి రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పాడి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టింది.ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల పశుసంపద రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, అనకాపల్లి లోక్‌సభ సభ్యుడు, రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సి.ఎం. రమేష్ చొరవలతో జిల్లాలో పాడి పశువులకు 3,52,000 డోసుల గాలికుంటు టీకాలు అందుబాటులో ఉన్నాయి.జిల్లా పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 16-3-2026 నుంచి 15-4-2026 వరకు తమ పశువులకు టీకాలు వేయించుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా అనకాపల్లి జిల్లా మార్కెట్ యార్డ్ సెల్ కన్వీనర్ గొంప సత్యనారాయణ పిలుపునిచ్చారు. పశువుల ఆరోగ్యం ద్వారా రైతుల ఆర్థిక బలోపేతం సాధ్యమవుతుందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి బీజేపీ కిసాన్ మోర్చా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

0
0 views

Comment