logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జాతీయ జెండా ఆవిష్కరించి పోటీలకు శ్రీకారం చుట్టిన గునుకుల కిషోర్

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 13వ సౌత్ జోన్ సీనియర్ జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్–2026 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, బెలూన్స్ ఎగరవేసి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“క్రీడలు కేవలం గెలుపు-ఓటముల కోసం మాత్రమే కావు… క్రమశిక్షణ, సహనం, నాయకత్వం మరియు టీమ్ స్పిరిట్‌ను నేర్పించే గొప్ప పాఠశాల” అని తెలిపారు.
యువత క్రీడల్లో ఎక్కువగా పాల్గొంటే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, సమాజానికి మంచి నాయకత్వాన్ని అందించే శక్తి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
“యువత శక్తి దేశ భవిష్యత్తు… క్రీడలు, విద్య, సామాజిక సేవల ద్వారా తమ ప్రతిభను నిరూపిస్తే సమాజం మరింత ముందుకు వెళ్తుంది” అని ఆయన అన్నారు.
ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ…
“గెలుపు ఒకరికే వస్తుంది, కానీ క్రీడాస్ఫూర్తి అందరికీ రావాలి” అని సూచించారు.
ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, లక్షద్వీప్, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి పురుషులు మరియు మహిళల విభాగాల్లో 280 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇక్కడ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మే నెలలో జరిగే సౌత్ ఏషియన్ గేమ్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక కాబోతున్నారు.
చివరిగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజింగ్ సెక్రటరీ పాటూరు అజయ్ కుమార్ మరియు స్పోర్ట్స్ టీమ్‌కు గునుకుల కిషోర్ అభినందనలు తెలిపారు

4
1022 views

Comment