logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సింగరేణి పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి ఇన్ చార్జ్ మేనేజర్ వి అప్పారావు కి వినతి పత్రం అందజేత *అఖిలపక్ష కార్మిక సంఘాలు,

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** మణుగూరు పట్టణం** మార్చి 16 **ఏఐఎంఏ మీడియా ప్రతినిధి**

సింగరేణి పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి
పీకే ఓ సి డిప్ సైడ్ సింగరేణి కే కేటాయించాలి
మణుగూరు మనుగడ కాపాడాలి


మణుగూరు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పీకే ఓ సి లో కదం తొక్కిన కార్మికులు
ఇన్ చార్జ్ మేనేజర్ వి అప్పారావు కి వినతి పత్రం అందజేత

సింగరేణి పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, పీకే ఓ సి డిప్ సైడ్ గనిని సింగరేణికే కేటాయించాలని,సింగరేణి ఉద్యోగులు చేతనే ఉత్పత్తి ప్రక్రియ కొనసాగించాలని, మణుగూరు మనుగడ కాపాడాలని సింగరేణి కార్మికులు ఎదుర్కొన్న దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, మెడికల్ బోర్డు ప్రతి నెల నిర్వహించాలని కోరుతూ మణుగూరు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నాడు మణుగూరు ఏరియా పీకే ఓసి ఆవరణలో కార్మికులు భారీ ప్రదర్శనతో కదం తొక్కారు సింగరేణి పరిరక్షించాలి, సింగరేణికే పీకే ఓసి డిప్ సైడ్ గని సింగరేణికి కటాయించాలి, ప్రైవేటీకరణ వద్దు సింగరేణి వద్దు అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. అనంతరం మేనేజర్ ఆపరేషన్స్ వి అప్పారావు గారికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ నూట ఎనభై ఒక్క మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిలువలు ఉండి సంస్థకు ప్రతి ఏటా పదిహేను వందల కోట్ల రూపాయలు లాభాలు తెచ్చిపెట్టే గని మణుగూరు మనుగడ సింగరేణి పరిరక్షణకు పీకే ఓ సి డిప్ సైడ్ గని కేటాయింపు అనివార్యం అన్నారు తెలంగాణకు వెన్నెముక సింగరేణి సంస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు దీనికై ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణికి గని కేటాయింపులో అన్యాయం చేయవద్దన్నారు.తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని చర్చించాలని కోరారు అదేవిధంగా కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగించాలని, ప్రతినెల మెడికల్ బోర్డు నిర్వహించాలని, పెర్క్స్ పై ఆదాయం పన్ను మినహాయించాలని సొంత ఇంటి కల నిజం చేయాలని కోరారు గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించగా ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు వత్సవాయి కృష్ణంరాజు, సిల్వేరు గట్టయ్య, షేక్ అబ్దుల్ రవూఫ్ (ఐ ఎన్ టి యు సి) ఎస్ కుమారస్వామి, రవి, (ఏఐటీయూసీ)వి వెంకటరత్నం, లక్ష్మణరావు (సి ఐ టి యు) షేక్ మస్తాన్, దరిసా రమేష్ (హెచ్ ఎం ఎస్) అంగోత్ మంగీలాల్ ఐ ఎఫ్ టి యు ఇంకా కార్మిక నాయకులు సయ్యద్ నయమత్ హుస్సేన్,బుర్ర వెంకటేశ్వర్లు, జీవరత్నం, సేవా,వాసులు, కుమార్ స్వామి,ఆర్ఎం ప్రసాద్,శ్రీధర్, లక్ష్మీనారాయణ, నరేష్ రాజకీయాలకతీతంగా పెద్ద ఎత్తున కార్మికులు సూపర్వైజర్లు పాల్గొన్నారు.

33
1661 views

Comment