logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఉగాది బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి.

పాణ్యం (పAIMA MEDIA): ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఉగాది బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి వెంకటరెడ్డిలు సోమవారం ఆవిష్కరించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి యం.రామక్రిష్ణ, ఉగాది ఉత్సవ కమిటీ అధ్యక్షులు మిలిటరీ సుబ్బారెడ్డి, ప్రధాన అర్చకులు సురేష్ శర్మ సిబ్బంది మొదటిగా కర్నూలు లోని ఎమ్మెల్యే వారి స్వగృహ కార్యాలయము నందు మర్యాదపూర్వకంగా కలిసి స్వామివారి శేష వస్త్రములు, శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మార్చి 19 నుండి 21 వరకు జరుగు ఉగాది బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించి ఎమ్మెల్యే దంపతుల చేతుల మీదుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తూరు సుబ్బారాయుని ఉగాది బ్రహ్మోత్సవముల యందు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

1
604 views

Comment