logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాయలసీమ రౌడీయిజం అంటే రాజసం కాదు. జీవిత నాశనం.

AIMA న్యూస్ బ్యూరో. ఒకప్పుడు రాయలసీమ అంటేనే భయం. ఖాకీ డ్రెస్ కనిపిస్తే పౌరుషం. గ్రూపు తగాదాలే జీవన వేదం. ఇది ఒకప్పటి సీమ రౌడీ షీటర్ల ముచ్చట. కానీ, సీన్ కట్ చేస్తే. ఇప్పుడు అదే వీధుల్లో ముసలితనంతో, రోగాలతో, కనీసం మందు బిళ్ళకు పైసల్లేక అలమటిస్తున్న ఆ నాటి రౌడీ పులులను చూస్తుంటే జాలి కలగడం లేదు. భయం వేస్తోంది. దేనికి? ఆవేశంతో అడుగులు వేసే నేటి తరం యువత భవిష్యత్తు కూడా ఇలాగే మారుతుందేమోనని
నాడు అండ ఇచ్చిన నాయకులు నేడు దరి చేరని వైనం నాడు మీసం తిప్పి, ప్రత్యర్థిని నరికినప్పుడు చప్పట్లు కొట్టిన పెద్దలు జైలుకు వెళ్తే బెయిల్ ఇప్పించిన నాయకులు ఇప్పుడు ఎక్కడ? ఒళ్ళంతా రోగాలు, దెబ్బలతో మంచాన పడితే పలకరించే నాథుడే లేడు. నాడు రాజకీయ అవసరాల కోసం పావులుగా వాడుకున్న వారు ఇప్పుడు ఏసీ గదుల్లో ఉన్నారు. కానీ, వారి కోసం రక్తం చిందించిన మీరు మాత్రం ఇప్పుడు పాతాళంలో ఉన్నారు.
పోలీసు లాఠీ దెబ్బ. జీవితాంతం వెన్నాడుతున్న చేదు జ్ఞాపకం.
వారానికో సంతకం. వయసు 60 దాటినా, కాళ్లు సహకరించకపోయినా. నేటికీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి సంతకం పెట్టాల్సిందే. ఆ అవమానం మీ ఒక్కరికే కాదు, మీ పిల్లలకు, వారి పిల్లలకు కూడా శాపమే. ఒకప్పుడు ఇనుప కండలతో విర్రవీగిన రౌడీ షీటర్లు, ఇప్పుడు పోలీసుల పాత దెబ్బల వల్ల ఎముకలు అరిగిపోయి, నడవలేక నానా అవస్థలు పడుతున్నారు.చేతిలో చిల్లిగవ్వ లేదు.చేద్దామంటే పాత రికార్డుల వల్ల ఏ పనీ రాదు. రోగానికి డబ్బులిచ్చే నాథుడు లేక, కన్నపిల్లల దగ్గర చేయి చాచలేక బతుకు ఈడ్చుకొస్తున్నారు.
నేటి నయా రౌడీలకు హెచ్చరిక
మా వెనుక ఫలానా నాయకులు ఉన్నారు. అని సోషల్ మీడియాలో ఫోజులిచ్చే కుర్రాళ్లారా. ఒక్కసారి మీ కంటే ముందు రౌడీ షీట్లు ఓపెన్ అయిన మీ పెద్దన్నలను వెళ్లి అడగండి. వారు చరిత్ర చెబుతారు.

245
8418 views

Comment