సనాతన ధర్మ హిందూ వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 23 నా ఇందర్వెళ్ళి మండలం, ఏమైకుంఠ శ్రీ జ్వాలా ముఖి క్షేత్రం లో
జరిగే విరాట్ హిందూ మహా సమ్మేళనం మరియు ఆలయ ప్రతిష్టపన కార్యక్రమానికి శ్రీ అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి వారిని సురేష్ మహారాజ్ నెత్రుత్వంలో ఆహ్వానించడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి మతమార్పిడులు, లవ్ జిహాద్ వంటి అంశాల పైనా హిందువులను జాగృతం చేయుటకు కార్యక్రమానికి ముఖ్య అతిథి గా రావాలని సనాతన ధర్మ హిందూ వేదిక అధ్యక్షులు జగదీష్ అగర్వాల్ కోరడం జరిగింది.న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి హిందూ ధార్మిక కార్యక్రమాల పైన స్వామి వారితో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. సనాతన ధర్మ హిందూ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించడం జరిగింది. వేదిక ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలు చాలా బృహత్తరమైనవని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని స్వామివారు కమిటీ సభ్యులకు సూచించడం జరిగింది. అదిలాబాదులో ఏ కార్యక్రమం జరిగిన తనను తప్పకుండా ఆహ్వానించాలని కోరడం జరిగింది. సనాతన ధర్మ వేదిక పడకంటి సూర్యకాంత్, గండ్రత్ సంతోష్, బిజెపి సీనియర్ నాయకులు కంటం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.