logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీశైలం ఉగాది బ్రహ్మోత్సవాలకు సుమారు 1800 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు



*ఉగాది బ్రహ్మోత్సవాలకు సుమారు 1800 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు...*

*ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు...*

*కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించాలి...*

*భక్తులకు అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించాలి....*

*భక్తులు సంయమనం పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలి.*

*జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ *
నంద్యాల జిల్లాలో శ్రీశైల క్షేత్రం నందు సోమవారం నుండి ఉగాది బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా బందోబస్తు నిమిత్తం వచ్చిన సెక్టర్ అధికారులతో( సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి నుండి డీఎస్పీ స్థాయి వరకు) సమావేశం ఏర్పాటు చేసి బందోబస్తులో చేయవలసిన విధులపై నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్,
ఈ సందర్భంగా మాట్లాడుతూ బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని ఎనిమిది సెక్టార్లుగా విభజించడం జరిగిందని,ప్రతి సెక్టార్ కు ఒక ఉన్నతాధికారిని నియమించి నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు.శ్రీశైలం నందు ట్రాఫిక్ సమస్యను అధిగమించుటకు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం 24/7 శ్రీశైలం క్షేత్రం చుట్టూ తిరుగుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవడం జరిగింది.
శ్రీశైల క్షేత్రం నందు వాహనాలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి ట్రాఫిక్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో పాటు సరిపడా సిబ్బందినినియమించడం జరిగింది.వివిధ రాష్ట్రాల నుంచి శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు వారి వాహనాలను ఇతరులకు ఇబ్బంది కలిగేలా రోడ్డుపైన పార్కింగ్ చెయ్యరాదు.
పోలీసుల సూచనల మేరకు రింగురోడ్డు వెనకాల గల మరియు RTC బస్టాండ్ వెనక పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి.కంట్రోల్ రూమ్ ద్వారా భక్తుల రద్దీని మరియు వాహనాల రద్దీని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ క్రమబద్ధీకరించేలా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో దర్శనాలు చేసుకునేలా విధులు నిర్వహించాలని అధికారులకు మార్గ నిర్దేశం చేయడం జరిగింది.
క్యూలైన్ కంపార్ట్మెంట్లోని భక్తులు సంయమనం పాటిస్తూ పోలీసు వారి సూచనలను అనుసరించి సురక్షితంగా దైవదర్శనం చేసుకోవాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N.యుగంధర్ బాబు, ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్,బందోబస్తుకు వచ్చిన అధికారులు పాల్గొన్నారు.

1
3748 views

Comment