logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రకృతి వ్యవసాయంలో విత్తనగుళికలు వలన ఉపయోగాలు


పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరు మండలం, మామిడిపల్లి గ్రామంలో విత్తన గుళికలు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు సమక్షంలో తయారీ చేశారు. గుళికలు తయారీకి కావలసిన పదార్ధాలు బిజామృతం, బంకమట్టి పొడి, ఘన జీవామృతం పొడి, బూడిద మొదట గోనె సంచిలో విత్తనాలు తీసుకుని ఈ పదార్ధాలు విత్తనాలు 3 నుండి 5 రెట్లు అయ్యేంత వరకు కలపాలి అని అప్పుడు విత్తన గుళికలు తయారీ అవుతాయని ఈ విత్తన గుళికలు వలన ఉపయోగాలు ఏమిటంటే విత్తనం ఆరు నెలలు వరకు భూమి లో సురక్షితంగా ఉంటుంది. కలిగే ప్రతికూల వాతావరణ మార్పులను తట్టుకుంటుందని, సాధారణంగా విత్తనాలు కనీసం ఇరవై రెండు నుండి ఇరవై అయిదు మిల్లిమీటర్ల వర్షపాతం అవసరం కాని వేసవిలో పొడి నేలలో విత్తనాలు మొలకెత్తడానికి తగిన తేమను కలిగి ఉండవు విత్తన గుళికలు విధానం ద్వారా కనీసం పది నుండి పదిహేను మిల్లిమీటర్ల తేమకు కూడా మొలకెత్తుతాయని, నేల నుండి, గాలి నుండి, విత్తనం నుండి సంక్రమించే తెగుళ్లు ను తట్టుకుంటాయని పురుగులను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి అని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది విత్తన గుళికలు తయారీ చేసి రైతులకు చూపించి విత్తన గుళికల ఉపయోగాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు హాజరయ్యారు .

62
2703 views

Comment