logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

దోపిడీ కి పాల్పడిన ఇద్దరి నిందితులు పై కేసు నమోదు, అరెస్ట్, రిమాండ్. దాడికి పాల్పడి రూ 1200 డబ్బు దోపిడీ చేసిన నిందితులు.

పత్రిక ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 15 :-
దోపిడీ కి పాల్పడిన ఇద్దరి నిందితులు పై కేసు నమోదు, అరెస్ట్, రిమాండ్.

దాడికి పాల్పడి రూ 1200 డబ్బు దోపిడీ చేసిన నిందితులు.

తిరుపెల్లి లో ఘటన, టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.


సెల్ఫోన్, రూ 500 నగదు స్వాధీనం

ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు

నిందితుల వివరాలు
A1) దండేవర్ అనికేష్ ,తండ్రి పేరు :కేశవ్, వయస్సు: 27 సంవత్సరాలు, నివాసము :మహాలక్ష్మి వాడ అదిలాబాద్.

A2) పిలివర్ రాజేష్ ,తండ్రి పేరు: నీలకంఠ, వయస్సు: 25 సంవత్సరాలు, నివాసము : గోటి గ్రామము, కిన్వాట్ : తాలూకా,
నాందేడ్ జిల్లా.
ప్రస్తుత నివాసము: మహాలక్ష్మి వాడ అదిలాబాద్.

దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించడం జరిగిందని ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు తెలియజేశారు.

వివరాలలో

ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం స్థానిక తిరుపెల్లి ఏరియా నందు కనకదుర్గ వైన్స్ సమీపంలో సోడా బండి నడుపుతున్న బాధితుడు చిత్తల్ వార్ దీపక్ వద్దకు ఈ ఇద్దరు నిందితులు వచ్చి సోడా తాగడం జరిగిందని, డబ్బులు అడగగా నువ్వు ఎవడివి రా మా ఏరియాలోకి వచ్చి వ్యాపారం చేస్తున్నావు అని బెదిరించి నీకు డబ్బులు ఇవ్వము అంటూ అతని గల్లా పెట్టే నుండి 1200 రూపాయలను దోపిడీ చేసి అతనిపై దాడి చేసి తీసుకెళ్లడం జరిగిందని ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసును నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు ఆధ్వర్యంలోని బృందం ఇద్దరి నిందితుల పై అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.

రౌడీయిజం చేస్తూ, దోపిడీలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి సెల్ ఫోన్ 500 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సైలు పీర్ సింగ్, విష్ణు ప్రకాష్, సిబ్బంది దత్తు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment