logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పడుగుపాడులో ప్రజలకు తోఫాల పంపిణీ – కార్యక్రమంలో షేక్ అహ్మద్ పాల్గొనం

నెల్లూరు జిల్లా, కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ఉన్న అహ్మదీయ మసీదు సెంటర్ వద్ద ఆదివారం ప్రజలకు తోఫాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సంయుక్త కార్యదర్శి షేక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో Sd దావూద్, ఖలీమ్, సలీం భాయ్, అజీజ్, మౌలాలి, అనీఫ్ బాయ్, సయ్యద్ బక్షు బాయ్ తదితరులు పాల్గొని ప్రజలకు తోఫాలు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

67
6711 views

Comment