వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసిన షకీలా బేగం
నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మునిసిపల్ విభాగం అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన శ్రీమతి షేక్ షకీలా బేగం గారు, మాజీ మంత్రివర్యులు మరియు వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి సూచనల మేరకు, నేడు నెల్లూరు లోని కార్యాలయంలో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి, మునిసిపల్ విభాగం బలోపేతం కోసం కలిసి పనిచేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సూచించారు. షకీలా బేగం గారు పార్టీ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు షేక్ షాహుల్ గారు, అల్లాబక్షు గారు (పెద్ద), కోడూరు మధుసూదన్ రెడ్డి గారు, కె. యానాది రెడ్డి గారు, శ్రీమతి బిట్రగుంట ప్రమీలమ్మ గారు, కడివేటి శ్రీనివాసులు రెడ్డి గారు, డాక్టర్ అల్లాబక్షు గారు, షేక్ బాబు గారు, శ్రీమతి షేక్ ఇర్షాద్ గారు, షేక్ అల్లాబక్షు గారు (చిన్న), కడివేటి అన్వేష్ కుమార్ రెడ్డి గారు, శ్రీమతి పర్రి పెంచల లక్ష్మీ తేజ గారు, మల్లికార్జున్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.