లేగుంటపాడులో ఉత్సాహంగా ఎద్దుల పందాలు
నెల్లూరు నగరం పరిధిలోని కోవూరు మండలం లేగుంటపాడు గ్రామంలో ఎద్దుల పందాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు యువకులు పాల్గొని సందడి చేశారు. కావలి శ్రీహరి, నన్నం శివ, తలారి హరి, తలారి మురళి, విడవలూరు కిష్టయ్య, నన్నం వెంకటరమణయ్య, నన్నం నారాయణ, దాసు, కొంగల కృష్ణ, కొంగల జగన్, చల్లం బెనర్జీ, డక్కా విష్ణు, ముదివర్తి, కొత్తపాలెం ప్రాంతాలకు చెందిన వారు తమ ఎద్దులతో పోటీల్లో పాల్గొన్నారు.
ఈ పోటీలను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆసక్తిగా వీక్షించారు. ఎద్దుల పందాలు గ్రామంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. 🐂