గూడూరు డిపో మహిళా కండక్టర్‌కు తప్పుడు హెచ్ఐవి సర్టిఫికేట్.. వైద్యురాలిపై ఫిర్యాదు
నెల్లూరు జిల్లాలోని గూడూరు డిపోకు చెందిన ఓ మహిళా కండక్టర్ తనను వైద్యురాలు అందరి ముందూ అవమానించిందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. తనకు హెచ్ఐవి ఉందంటూ తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిందని ఆమె ఆరోపించారు. ఈ ఘటన ఈ ఏడాది జనవరిలో జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనిపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టగా, సంబంధిత వైద్యురాలిని మందలించినట్లు సమాచారం. అనంతరం బాధితురాలు ల్యాబ్‌లో రక్తపరీక్షలు చేయించగా హెచ్ఐవి నెగటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.