శనివారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ ముత్యాలరావుతో కలిసి
నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని ఇనమడుగు కోడలి వద్ద శనివారం రాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ ముత్యాలరావుతో కలిసి ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా అనుమానాస్పదంగా తిరిగే వాహనాలు, వ్యక్తులను గుర్తించే లక్ష్యంతో ప్రతి వాహనాన్ని ఆపి పోలీసులు పత్రాలు పరిశీలించారు.
సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు తమ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానితుల కదలికలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు