అత్యంత వైభవంగా భూలోకమాతా అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభం.
చీపురుపల్లి: మండలంలోని అలకనారాయణపురం గ్రామంలో ప్రజలు ఆరాధ్య దైవం శ్రీ భూలోక మాతా అమ్మవారి జాతర ఈరోజు ప్రారంభమైంది. జాతర మొదటి రోజు సందర్భంగా అమ్మవారికి అభిషేకం,అనంతరం అఖండ దీపారాధన, మండప ఆవాహనం, కళశస్థాపన మొదలగు కార్యక్రమంలు ఆలయ అర్చకులు రేజేటి.కార్తీక్ శర్మ గారు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఆలయం ధర్మకర్తలు సాగిరాజు వంశీయులు సాగిరాజు.సూర్యనారాయణ వర్మ గారి కుమారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాలులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15,16,17 తేదీల్లో జాతర జరుగుతుంది. 17 తేదీన దుర్గా హోమంతో జాతర ఉత్సవాలు సంపూర్ణo అవునని, కావున భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించి, అమ్మ అనుగ్రహం పొందాలని ఆలయ అర్చకులు తెలిపారు.