సూళ్లూరుపేటలోని శ్రీ వెంకటేశ్వర జువెలెర్స్ షాపులో భారీ దోపిడి
సూళ్లూరుపేటలోని శ్రీ వెంకటేశ్వర జువెలెర్స్ షాపులో భారీ దోపిడి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని కచేరి వీధిలోనీ శ్రీ వెంకటేశ్వర జువెలర్స్‌లో శనివారం మధ్యాహ్న సమయంలో షాపులో దోపిడి జరిగింది. ఓ దుండగుడు కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ కొంతసేపు అక్కడే తిరిగాడు.
అనంతరం ఒక్కసారిగా షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి బంగారు నగలను పట్టుకెళ్లాడు.
కారం పొడి వల్ల యజమాని కొంతసేపు ఏమీ చూడలేని పరిస్థితి ఏర్పడడంతో దుండగుడు ఆ అవకాశాన్ని వినియోగించుకుని షాపులో ఉన్న సుమారు రూ.30 లక్షల విలువైన 916హల్ల్మర్క్ బంగారు నగలను అపహరించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనతో కచేరి వీధి ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
సమాచారం అందుకున్న వెంటనే సూళ్లూరుపేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
షాపు యజమాని మరియు అక్కడున్న వారిని విచారించారు. అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ దుండగుడిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.