logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

28వ డివిజన్‌లో మిత్రమండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

28వ డివిజన్‌లోని చైతన్యపురి కాలనీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ దయాకర్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బలరాం నాయుడు, కొండూరు సుబ్బారావు తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం విశేషం.
ఇంకా పలువురు స్థానిక ప్రముఖులు, కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. 🩸👏

0
0 views

Comment