28వ డివిజన్లో మిత్రమండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
28వ డివిజన్లోని చైతన్యపురి కాలనీ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ దయాకర్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బలరాం నాయుడు, కొండూరు సుబ్బారావు తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం విశేషం.
ఇంకా పలువురు స్థానిక ప్రముఖులు, కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. 🩸👏