[10th class students ]ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి – నల్లపెరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే నల్లపెరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు చేసిన కష్టానికి తగిన ఫలితం తప్పకుండా వస్తుందని, క్రమశిక్షణతో చదివిన ప్రతి విద్యార్థి విజయాన్ని సాధించగలడని ఆయన పేర్కొన్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని గుర్తుంచుకొని ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి మంచి ఫలితాలు సాధించి తమ కుటుంబాలకు గర్వకారణం కావాలని మాజీ ఎమ్మెల్యే నల్లపెరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆకాంక్షించారు.
మరోసారి పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.