🔹శామా నాయక్ తండలో సుగుణక్క పరామర్శ.. సాగర్ టీచర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
ప్రెస్ రిలీజ్
తేదీ:15-03-2025
ఉట్నూర్:ఉట్నూర్ మండలం శామా నాయక్ తండకు చెందిన సాగర్ టీచర్ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో సుగుణక్క వెంట స్థానిక సర్పంచ్ ఇంధల్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వసంత్ రాథోడ్, నాగపూర్ మాజీ సర్పంచ్ సునీల్ జాదవ్, మనోజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ కార్యాలయం కుమురం భీం ఆసిఫాబాద్