ట్రిపుల్ ఐటీ కళాశాలలో స్టూడెంట్ వెల్ఫేర్(బాయ్స్) నూతన డీన్‌గా సింహాచలం
ఎచ్చెర్ల : స్థానిక ట్రిపుల్ ఐటీ కళాశాలలో స్టూడెంట్ వెల్ఫేర్(బాయ్స్) నూతన డీన్‌గా సింహాచలం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ అమరేంద్ర కుమార్, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, వాసు సాగర్, సిబ్బంది అభినందించారు.