శ్రీ శ్రీ శ్రీ విజయగణపతి స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్
AIMA న్యూస్ శ్రీకాకుళం :
*▪️పాతపట్నం నియోజకవర్గం సీతారామపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ విజయగణపతి స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరైన పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు గారు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల శాంతి, సుభిక్షాలు, అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం లక్ష రూపాయల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు..*
*▪️అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు అని తెలిపారు.ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను పెంపొందించి సమాజానికి మంచి దారిని చూపుతాయని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా పాల్గొని మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు..*
*▪️ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..*