*పొందూరులో ఆడపిల్లలకు HPV టీకా* *కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కూన* *రవికుమార్ గారు
*పొందూరులో ఆడపిల్లలకు HPV టీకా* *కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే కూన* *రవికుమార్ గారు* ....
👉ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు పట్టణంలోని సచివాలయంలో 11,12 సంవత్సరాలు కలిగిన ఆడపిల్లలకు సెర్వికల్ క్యాన్సర్‌ను నివారించే HPV వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ గారు ప్రారంభించారు.
👉ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు HPV టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, భవిష్యత్తులో మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే సెర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ టీకా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు. చిన్న వయస్సులోనే ఈ టీకా వేయించడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను ముందుగానే నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.
👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బాలికల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. బాలికల ఆరోగ్యం బాగుంటేనే భవిష్యత్ సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, అందుకే ప్రభుత్వం ఈ తరహా కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తప్పనిసరిగా ఈ టీకా వేయించాలని ఆయన సూచించారు.
👉ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. టీకా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాటు చేశారని ప్రజలు దీనిని వినియోగించుకోవాలని తెలియజేశారు.