76వ వార్డులో జనసేన13 వ ఆవిర్భావ దినోత్సవం.....
గాజువాక (పెద్ద గంట్యాడ మండలం)
76వ వార్డు చిన్న కోరాడ గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు..
వార్డులో పల్లిచోటల జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది.ఇందులో భాగంగా ప్రధాన కూడలిలో జెండా ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన 75 వ వార్డు జనసేన ప్రధాన కార్యదర్శి,విశాఖ అర్బన్ జనసేన మహిళా నాయకురాలు దాసరి జ్యోతి రెడ్డి పాల్గొన్నారు.ఇందులో భాగంగా జ్యోతి రెడ్డి జన సైనికులతో కలిసి జండా ఆవిష్కరించి తదనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించడం జరిగింది.జ్యోతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదో చేయాలని అకుంఠిత దీక్షతో.2014మార్చి 14న పవన్ కల్యాణ్ ఈ పార్టీని స్థాపించారు.ఈ ఏడాది 13వ వార్షికోత్సవం జరుపుకున్నారు.2024 ఎలక్షన్లో కోటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం గా చూడటం మాకు ఎంతో సంతోషదాయకంగా ఉందని తెలిపారు.రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులుగా చూడాలని సేనతో సేనాని కోరిక అని తెలిపారు.జనసేన పార్టీ 76వ వార్డు సీనియర్ నాయకులు జమ్ముల పెంటయ్య,గోవింద్,రమణ సారిపల్లి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల కష్టాలను తెలుసుకునే నాయకుడిగా ప్రజల ఆశలను తన శక్తిగా మరుల్చుకుని ప్రజలకు ఆశలను త్వరితగతిన తీర్చే మా నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.పార్టీ ఆవిర్భావం ముందు నుంచే ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలత కనబరిచిన మా నాయకుడు పవన్ కళ్యాణ్.ఆయన ఆశలకు అనుగుణంగా పార్టీని పెట్టి ప్రజల సమస్యపై పోరాడి ప్రస్తుత 2024 డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టి ప్రజల కోర్కెలను నెరవేరుస్తూ మరింత అభివృద్ధి బాటలో కొనసాగాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలోఅబ్దుల్ వహీద్,ఈశ్వర్ రావు, సంతోష్,కాండ్రేగుల నాగేశ్వరావు,సారిపల్లి ప్రసాద్,త్రినాధ్ మేస్త్రి , బల్ల సురేష్ m షేక్ మౌలాలి,గొంతెన కుమార్ (చంటి),పెంటి బాబు,
గంట దొరబాబు,త్రినాథ్, తదితరులు జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.