అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కు బీసివి తోడ్పాటు :*......
*అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కు బీసివి తోడ్పాటు :* మడకశిర నియోజకవర్గం కోడిపల్లి గ్రామం అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు త్వరలో కోడిపల్లి గ్రామంలో జరిగే రాజ్యాంగ నిర్మాత BR అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహణకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి బహుజన చైతన్యవేదిక బృందం సభ్యులను విగ్రహ కమిటీ సభ్యులు గ్రామానికి ఆహ్వానించిన సందర్బంగా కోడిపల్లి గ్రామంలోని విగ్రహన్ని పరిశీలించిన బహుజన చైతన్యవేదిక వ్యవస్థపాక అధ్యక్షులు, హైకోర్ట్ అడ్వకేట్ శివరామకృష్ణ తమ సంస్థ ద్వారా అంబేద్కర్ విగ్రహవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా జరగడానికి కృషి చేస్తామని, తమ సంస్థ ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హిందూపురం నాగార్జున, రాయలసీమ ఉపాధ్యక్షుడు చల్లపల్లి ఈశ్వర్, పెనుకొండ నియోజకవర్గం గౌరవ అధ్యక్షుడు రిటైర్డ్ విఆర్వో గోవిందప్ప, కోడిపల్లి అశ్వత్థ నారాయణ., రంగనాథ ,రమేష్. గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు.