logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అనంతపురంలో దివ్యాంగులకు ప్రత్యేక ఇంక్యుబేటర్ ఏర్పాటు*



*దివ్యాంగుల వ్యాపార అభివృద్ధి శిక్షణ కార్యక్రమం*ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీ నారాయణ*గుర్తింపు ఫౌండేషన్ కు పూర్తి సహకారం.. ఈరోజు జన్తు అనంతపురంలో దివ్యాంగులకు ప్రత్యేక ఇంక్యుబేటర్ ఏర్పాటు*

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, అనంతపురం స్పోక్, గుర్తింపు ఫౌండేషన్ మరియు అటల్ ఇంక్యుబేటర్ సెంటర్ ఎస్.కే.యూ వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఐదు రోజుల పాటు జరిగిన వ్యాపార శిక్షణ అభివృద్ధి కార్యక్రమం ముగింపు సభలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీ నారాయణ ముఖ్య అతిథిగా, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ జీ.నారాయణ స్వామి గౌరవ అతిధిగా, ఆర్.డి.టి డైరెక్టర్ రఫీక్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనంతపురం స్పోక్ సి.ఈ.ఓ. డా.ఆర్ హఫీజ్ భాషా, ఏఐసిఎస్కేయూ సీఈవో డా.చంద్ర మౌళి, గుర్తింపు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కొప్పుల వసుంధర, డైరెక్టర్ నరేంద్ దేవులపల్లి, ఇగ్నైట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి నఫీసా పర్వీన్, రతన్ టాటా IGNITE టీమ్ ఎం.సమీరా భాను, పి. పరమేష్ నాయక్ , స్పాన్సర్లు కెనరా బ్యాంక్ మేనేజర్ కార్తికేయ అతిథులు పాల్గొన్నారు.

- ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దివ్యంగులు తమ స్కిల్స్ ను పెంపొందించుకొని వ్యాపార రంగం లో అవకాశాలు అందుకోవాలని కోరారు. అందుకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గుర్తింపు ఫౌండేషన్ కి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వికలాంగులకు 6000 నుంచి 15000 వరకు వివిధ రకాల పెన్షన్లు అందజేస్తుందని, వికలాంగుల భవనానికి ఎంపీ నిధులు సహాయం చేస్తామని, ఆర్టీసీ రైల్వేలో ప్రత్యేక రిజర్వేషన్ సదుపా కల్పించాలని, ఇన్నోవేషన్ ద్వారా కూడా విభిన్న ప్రతిభావంతులకు మంచి అవకాశాలు లభిస్తాయని ఎంపీ తెలియజేశారు. నారాయణ స్వామి మాట్లాడుతూ ఐదు రోజుల ట్రైనింగ్ తర్వాత దివ్యాంగులు అద్భుతమైన వ్యాపార ఆలోచన తో ముందుకు రావడం వ్యాపార రంగంలో దివ్యాంగుల ఉన్నతికి సూచిక గా పేర్కొన్నారు.

- డా. హఫీజ్ భాషా మాట్లాడుతూ, ఉదయం నుంచి దాదాపు 40 మంది తమ ఆలోచనలు పంచుకున్నారని ,వాటిలో ఎంపిక కాబడిన ఆలోచనలకు తదుపరి శిక్షణ, ఆర్ టి ఐ హెచ్ నుంచి సహకారం ప్రభుత్వం తరపున అందుతాయని తెలిపారు. గుర్తింపు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కొప్పుల వసుంధర మాట్లాడుతూ 200 మంది మాకు శిక్షణ కోసం సంప్రదించారని, 80 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 50మందికి ఐదు రోజుల పాటు వ్యాపార అభివృద్ధి కి సంబంధించి వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వగా 40 మంది, దివ్యాంగుల రైలు ప్రయాణ కోసం ఒక ప్రత్యేక అప్, సైకిల్ తొక్కుతూ జ్యూస్ తయారీ, సోలార్ ప్యానెల్ సర్వీస్, మిల్లెట్ స్నాక్స్, 3డీ మినీఏచర్ బొమ్మల తయారీ వంటి విన్నూతమైన తమ వ్యాపార ఆలోచనలు పంచుకొన్నారని , వీరికి గుర్తింపు ఫౌండేషన్ ఇంక్యుబేటర్ డీ.ఈ హబ్ ద్వారా తదుపరి నాలుగు నెలల శిక్షణ ఉండబోతుందని తెలిపారు.

0
0 views

Comment