logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు..* తగినంత నిల్వ ఉంది.*జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*

*జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు..*
తగినంత నిల్వ ఉంది.*అక్రమంగా గ్యాస్ నిల్వ ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం*

అనవసరంగా ఆందోళన చెంది అవసరం లేకున్నా గ్యాస్ బుక్ చేసుకుని నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు... ప్రజలు సహరించాలని విజ్ఞప్తి*

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*
జిల్లాలో డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, తగినంత నిల్వ ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సహకరించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా గ్యాస్ నిల్వ ఉంచి ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం రాత్రి గుత్తి పట్టణంలోని ఫుట్ బాల్ గ్రౌండ్ లో నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.*

- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్యాస్ కొరతపై సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో గ్యాస్ కొరత ఉందని వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మన రాష్ట్రంలో సుమారు 17వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపారు. అవసరం మేరకు గతంలో ఏవిధంగా అయితే గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారో ఆ విధంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని కోరుతున్నామన్నారు. అనవసరంగా ఆందోళన చెంది అవసరం లేకున్నా గ్యాస్ బుక్ చేసుకుని నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రజలు గమనించాలన్నారు.*

- *ఏదైనా గ్యాస్ ఏజన్సీ గాని, ఇతరాలు గానీ ఎవరైనా అక్రమంగా ఎల్పీజీ గ్యాస్ నిల్వ ఉంచి బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డొమెస్టిక్ గ్యాస్ ఏదైనా బ్లాక్ లో అమ్మడం కానీ, అక్రమంగా నిల్వ ఉంచినట్లు సమాచారం ఉంటే పౌర సరఫరాల అధికారులకు ఫిర్యాదు చేసి తెలియజేయాలన్నారు. అక్రమ నిల్వలపై తనిఖీలు నిర్వహించడానికి అధికారులతో ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.*

0
0 views

Comment