చిత్తూరు జిల్లా గుడిపాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాను పోలీసులు అడ్డుకున్నారు.
నమస్తే CH9 TV న్యూస్ కు స్వాగతం
చిత్తూరు జిల్లా గుడిపాల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాను పోలీసులు అడ్డుకున్నారు.
నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో చిత్తూరు నుండి తమిళనాడుకు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో, గుడిపాల ఎస్ఐ తన సిబ్బందితో కలిసి నరహరిపేట చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు.
ఈ సమయంలో చిత్తూరు వైపు నుండి వచ్చిన రెండు ఇసుక లారీలు పోలీసులను చూసి ఆగాయి. ఒక లారీ డ్రైవర్ అక్కడి నుండి పారిపోగా, మరో లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన డ్రైవర్ పేరు షణ్ముఘం అని గుర్తించారు. పూతలపట్టు వద్ద ఇసుక లోడ్ చేసుకొని తమిళనాడులోని చెన్నై, సేలం, వెల్లూరు ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడించాడు.
ఈ ఘటనపై పోలీసులు డ్రైవర్ షణ్ముఘం, పరారైన మరో డ్రైవర్ మరియు రెండు లారీల యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.