ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. మండల కేంద్రంలో గిరిజన కమ్యూనిటీ హాల్ లో అలీప్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ప్రారంభించారు. మహిళలను కోటిశ్వరులను చేయాలనే ప్రభుత్వ లక్ష్యమని, స్వయం ఉపాధి పొంది, నైపుణ్యాన్ని సాధించి ఆయా రంగాల్లో నిలదొక్కుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మహిళల స్వయం ఉపాధి కోసం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయని, శిక్షణ పూర్తయిన వారికి కుట్టు మిషన్లు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.