logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న జనసేన – కిషోర్ గునుకుల

నెల్లూరు జిల్లా గోమతి కార్యాలయంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్‌జీ టీమ్ యువనేత హర్ష, జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్, కిషోర్ గునుకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ, జనసేన పార్టీ స్థాపించిన సమయంలో పార్టీ అధ్యక్షులు Pawan Kalyan చెప్పిన ఆశయాలు నేడు మరింత బలంగా కార్యరూపం దాల్చుతున్నాయని తెలిపారు. యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే సంకల్పంతో జనసేన పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
“సమాజ అభివృద్ధి – యువత శక్తి – ప్రజల భవిష్యత్తు” అనే లక్ష్యంతో జనసేన కార్యకర్తలు పనిచేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా నేటి తరం అయిన Gen-Z యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తూ వారిని నాయకత్వం వైపు తీసుకెళ్లే పార్టీ జనసేన మాత్రమేనని తెలిపారు.
అలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, జనసేన సిద్ధాంతాలకు వారధులుగా నిలుస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీకి తమ అంకితభావాన్ని తెలిపారు.

0
13 views

Comment