క్రేన్ వైర్ తెగి ముగ్గురు కూలీలు దుర్మరణం
జర్నలిస్ట్: ఆకుల గణేష్
మొగుళ్లపల్లి మండలం కొరికిశాల గ్రామంలో వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ వైరు తెగిపడి ముగ్గురు కూలీలు మృతి చెందారు. బావిలో మట్టి తొలగిస్తున్న సమయంలో క్రేన్ కూలీలపై పడటంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సుకిన దేవారావు (48), బండారి అభిలాష్ (16), సరిగొమ్ముల (53)గా పోలీసులు గుర్తించారు.