logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నిర్భయ నిధి కింద 'ములుగు' జిల్లా ఎంపిక

జర్నలిస్ట్: ఆకుల గణేష్

నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు" కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను ఎంపిక చేశారు. ఈ ఎంపిక పట్ల తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మహిళలు, బాలికల భద్రత, సాధికారతకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

0
88 views

Comment