జాతీయ గణాంక కార్యాలయం నూతన భవనం
పత్రిక ప్రకటన
కాకినాడ,14.3.2026
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనీ జాతీయ గణాంక కార్యాలయం క్షేత్ర కార్యకలాపాల విభాగం , కాకినాడ నూతన భవనం సముదాయాన్ని ఆ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి సునీత భాస్కర్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక సాల్ట్ కమిషనర్ ఆఫీస్ కాంపౌండ్ జన్మభూమి పార్క్ రోడ్ లో నిర్మించిన నూతన భవన ప్రారంభం సందర్బంగా ఆమె మాట్లాడుతూ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక దక్షిణ భారత దేశం లోనే మొట్ట మొదటి సొంత భవనాన్ని కలిగిన ఏకైక కార్యాలయం అని ప్రశంసించారు. 2009 నుండి భవన నిర్మాణ దిశగా ఎంతో ప్రయాస పడినప్పటికిని 2026 నాటికీ కొత్త భవనం సాకరం కావడం అభినందనీయమన్నారు. సిబ్బంది ఉత్సాహంగా పనిచేయటమే కాకుండ కార్యాలయ భవనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. జోనల్ హెడ్ శ్రీ అనుపమ్ లాహిరి మాట్లాడుతూ భవన నిర్మాణ నికి రిటైర్డ్ అధికారి అయిన కిరణ్ కుమార్ చేసిన కృషిని కొనియాడారు. అదేవిధంగా రిటైర్డ్ అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నూతన భవన నిర్మాణానికి తన హయాంలో చేసిన అన్ని ప్రయత్నాలు వివరించారు. ఇంచార్జ్ బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారుల కృషిని కొనియాడారు. సాంస్కృతిక కార్యక్రమలలో భాగంగా కూచిపూడి నృత్యాలు మరియు సీనియర్ స్టాటిస్టికల్ అధికారి కృపానిది కవిత అందరిని అలరించాయి.
....
డిఐపిఆర్వో,కాకినాడ