logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పోలీస్ సిబ్బందికి మెగా ఐ మెడికల్ క్యాంప్ నిర్వహణ.AP

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
తేదీ: 14-03-2026.(AP)

- పోలీస్ సిబ్బందికి మెగా ఐ మెడికల్ క్యాంప్ నిర్వహణ.

- తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో అగర్వాల్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఐ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది . ఈ వైద్య శిబిరాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్. గారు ప్రారంభించారు.

- ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడం చాలా ఆనందదాయకమని తెలిపారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించే సిబ్బంది రోజువారీగా బిజీగా ఉండటంతో ఆరోగ్యపరమైన విషయాలకు సరైన సమయం కేటాయించలేని పరిస్థితులు తరచుగా ఎదురవుతాయని చెప్పారు. ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పోలీస్ సిబ్బందికి వారి పనిచేసే ప్రదేశంలోనే అవసరమైన వైద్య పరీక్షలు అందుబాటులోకి రావడం ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.

- అలాగే ఇలాంటి క్యాంపుల ద్వారా కంటి సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి, తగిన చికిత్స పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యం మెరుగ్గా ఉండటం వలన వారు మరింత సమర్థవంతంగా సేవలందించగలరని తెలిపారు.

- ఈ మెడికల్ క్యాంప్‌లో అగర్వాల్ ఐ హాస్పిటల్‌కు చెందిన నిపుణులైన వైద్యులు ఆధునిక పరికరాల సహాయంతో కంటి పరీక్షలు నిర్వహించారు.

- ఈ సందర్భంగా సుమారు 265 మంది పోలీస్ సిబ్బంది తమ కంటి పరీక్షలు చేయించుకొని, అవసరమైన వైద్య సూచనలు మరియు చికిత్స గురించి సమాచారం పొందారు. అలాగే 150 సన్ గ్లాసులను ట్రాఫిక్ పోలీస్ వారికి వితరణ చేశారు.

- ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, శ్రీ వెంకటరావు (పరిపాలన) శ్రీ రవి మనోహర ఆచారి (శాంతి భద్రతలు) శ్రీ ఐ రామకృష్ణ (తిరుమల)శ్రీ శ్రీనివాసులు (క్రైమ్స్ )శ్రీ శ్రీనివాసులు (సాయిధలం) డాక్టర్ సుమంత్ రెడ్డి అగర్వాల్ హాస్పిటల్ ఎండి, పోలీస్ డాక్టర్ మాధురి గారు, అధికారులు, పోలీస్ సిబ్బంది మరియు అగర్వాల్ ఐ హాస్పిటల్ యాజమాన్యం పాల్గొన్నారు.

0
0 views

Comment